ఐపీఎల్ 2021 : టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేయనున్న పంజాబ్

ఐపీఎల్ 2021 : టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేయనున్న పంజాబ్

ఐపీఎల్ 2021 లో ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్-పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు చెన్నై కెప్టెన్ ధోని. అయితే ఈ ఐపీఎల్ సీజన్ లో ఆడిన మొదటి మ్యాచ్ లో చెన్నై ఓడిపోగా పంజాబ్ విజయం సాధించింది. ఇక గత మ్యాచ్ లో పంజాబ్ బ్యాట్స్మెన్స్ మంచి ఫామ్ లో కనిపించరు. అయితే ఈ మ్యాచ్ లో గెలిచి ఐపీఎల్ 2021 లో తమ ఖాతాను తెరవాలని చెన్నై చూస్తుంటే... గత సీజన్ లీగ్ మ్యాచ్ లో చెన్నై చేసిన పనికి ప్రతీకారాని తీర్చుకోవాలని పంజాబ్ చూస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

పంజాబ్ : కే.ఎల్ రాహుల్ (w/c), మయాంక్ అగర్వాల్, క్రిస్ గేల్, దీపక్ హూడా, నికోలస్ పూరన్, షారుఖ్ ఖాన్, రిచర్డ్సన్, మురుగన్ అశ్విన్, రిలే మెరెడిత్, మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్
 
చెన్నై : రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డు ప్లెసిస్, సురేష్ రైనా, మొయిన్ అలీ, అంబటి రాయుడు, ఎంఎస్ ధోని (w/c), రవీంద్ర జడేజా, సామ్ కర్రన్, డ్వేన్ బ్రావో, శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్