సిఎస్కే ఆటగాళ్లకు కష్టమే ... ఎందుకంటే..?

సిఎస్కే ఆటగాళ్లకు కష్టమే ... ఎందుకంటే..?

కరోనా కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ యూఏఈ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 8 వరకు జరగనుంది. ఇందుకోసం ఆటగాళ్లు ఒక నెల ముందే అక్కడికి చేరుకోనున్నారు. అయితే ఐపీఎల్ లో పాల్గొనేందుకు ఆటగాళ్లు కరోనా నియమాలు తప్పకుండ పాటించాలి. అందుకోసం టోర్నీ మొత్తం వారు బయో- సెక్యూర్ బబుల్‌ లో ఉండాల్సి ఉంటుంది. ఇక మొత్తం 53 రోజులు జరగనున్న ఐపీఎల్ కు ఆటగాళ్ల కుటుంబ సభ్యులను అనుమతించాలా.. వద్ద అనే విషయాన్ని బీసీసీఐ ఫ్రాంఛైజీలకే వదిలేసింది. ఒకవేళ అనుమతిస్తే వారు కూడా లీగ్ ముగిసేంతవరకు బయో సెక్యూర్ బబుల్‌లో ఉండాల్సిందే అని చెప్పింది. అయితే ఈ విషయం లో చెన్నై సూపర్ కింగ్స్(సిఎస్కే) ఆటగాళ్ల కుటుంబ సభ్యులను యూఏఈ కి అనుమతించడం రిస్క్ అవుతుందని భావిస్తున్నారట. ఎందుకంటే సిఎస్కే జట్టులో ఎక్కువశాతం మంది ఆటగాళ్లు పెళ్ళైన వారే ఉన్నారు. కాబట్టి వారందరిని అక్కడికి తీసుకెళ్లి బయో సెక్యూర్ బబుల్‌లో ఉంచడం కష్టం కాబట్టి అలాగే ఆ అధికారం కూడా వారికే ఉండటంతో సిఎస్కే ఫ్రాంఛైజీ ఈ నిర్ణయం తీసుకుంట్ల తెలుస్తుంది.