వాట్సాన్, జడేజాలకు అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చిన సిఎస్కే...

వాట్సాన్, జడేజాలకు అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చిన సిఎస్కే...

ఐపీఎల్ 2020 కోసం యూఏఈ కి వెళ్లిన అన్ని జట్లలో కేవలం చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో మాత్రమే కరోనా కలకలం రేపింది. ఆ జట్టులో మొత్తం 13 మంది కరోనా బారినపడ్డారు. అందువల్ల ఆ జట్టు ఆరు రోజులు ఎక్కువగా క్వారంటైన్ లో గడిపి ప్రాక్టీస్ మొదలుపెట్టింది. ఇక రేపు ప్రారంభం కానున్న ఈ ఐపీఎల్ 13వ సీజన్ మొదటి మ్యాచ్ లో సిఎస్కే ముంబై ఇండియన్స్ తో తలపడనుంది. ఇక గతేడాది ఈ రెండు జట్లు ఫైనల్ లో పోటీ పడ్డాయి. అప్పుడు ముంబై కప్ గెలిచిన అభిమానుల మనసు మాత్రం సిఎస్కే ఆటగాడు షేన్ వాట్సాన్ గెలుచుకున్నాడు. ఎందుకంటే తన జట్టు విజయం కోసం రక్తం కారుతున్న పట్టించుకోకుండా పరుగులు చేసాడు. కానీ సిఎస్కేకు మాత్రం ఓటమి తప్పలేదు. అయితే ప్రస్తుతం ఐపీఎల్ 2020 కోసం ప్రాక్టీస్ చేస్తున్న వాట్సాన్ అలాగే ఆ జట్టు కీలక ఆటగాడు రవీంద్ర జడేజా కు సిఎస్కే జట్టు యాజమాన్యం అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చింది. గత ఏడాది వాట్సాన్ జట్టుకోసం రక్తం దారపోసిన విషయాన్ని గుర్తుచేసేలా అతనికి ఒక పేంటింగ్ ఇవ్వగా జడేజా కు ఎంతో ఇష్టమైన 'కత్తి'ని కానుకగా అందజేసింది. ఈ ఇద్దరు ఆటగాళ్లు జట్టు తమకు ఇచ్చిన గిఫ్ట్స్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.