చెన్నై టార్గెట్ 148..

చెన్నై టార్గెట్ 148..

ఐపీఎల్ 2019 సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్‌కింగ్స్‌- ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న టీ-20 మ్యాచ్‌లో చెన్నై ముందు 148 పరుగుల టార్గెట్ పెట్టింది ఢిల్లీ. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్... నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసి... చెన్నై ముందు 148 పరుగుల టార్గెట్ పెటింది. శిఖర్  ధావన్‌ 51 పరుగులతో రాణించగా, రిషభ్‌ పంత్‌ 25, పృథ్వీషా 24, శ్రేయస్‌ అయ్యర్‌ 18 పరుగులు చేశారు. ఇక పరుగులు రాబట్టాల్సిన కీలక సమయంలో త్వరగా వికెట్లు సమర్పించుకున్నారు. చివరి 5 ఓవర్లలో ఢిల్లీ జట్టు 4 వికెట్లు కోల్పోయి కేవలం 29 పరుగులు మాత్రమే చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్‌లలో బ్రావో మూడు వికెట్లు తీయగా... దీపక్‌ చాహర్‌, రవీంద్ర జడేజా, ఇమ్రాన్‌ తాహిర్‌ తలో వికెట్ తమ ఖాతాల్లో వేసుకున్నారు.