చెన్నై చేతిలో ఢిల్లీ చిత్తు..

చెన్నై చేతిలో ఢిల్లీ చిత్తు..

బుధవారం రాత్రి చిదంబరం స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టును 80 పరుగుల తేడాతో ఓడించింది. 180 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టు 16.2 ఓవర్లకే 99 పరుగులు చేసి ఆలౌటైంది. ఢిల్లీ ఆటగాళ్లలో శ్రేయస్‌ అయ్యర్‌ (44; 31 బంతుల్లో 4ఫోర్లు, 1సిక్స్) టాప్‌ స్కోరర్‌. ఢిల్లీ, చెన్నై ఇప్పటికే ప్లేఆఫ్స్‌ చేరిన సంగతి తెలిసిందే. తొలుత బ్యాటింగ్‌కు దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. వాట్సన్ 0, డు ప్లెస్సిస్ 39, రైనా 59, ధోనీ 44, జడేజా 25, రాయుడు 5 పరుగులు చేశారు. 

చెన్నై సూపర్‌కింగ్స్‌ ఇన్నింగ్స్‌: 
డుప్లెసిస్‌ (సి) ధావన్‌ (బి) అక్షర్‌ పటేల్‌ 39; వాట్సన్‌ (సి) అక్షర్‌ పటేల్‌ (బి) సుచిత్‌ 0; రైనా (సి) ధావన్‌ (బి) సుచిత్‌ 59; ధోని నాటౌట్‌ 44; జడేజా (సి) అండ్‌ (బి) మోరిస్‌ 25; రాయుడు నాటౌట్‌ 5; ఎక్స్‌ట్రాలు 7 
మొత్తం: (20 ఓవర్లలో 4 వికెట్లకు) 179; 
వికెట్ల పతనం: 1-4, 2-87, 3-102, 4-145; 
బౌలింగ్‌: 
ట్రెంట్‌ బౌల్ట్‌ 4-0-37-0; సుచిత్‌ 4-0-28-2; మోరిస్‌ 4-0-47-1; అక్షర్‌ పటేల్‌ 3-0-31-1; అమిత్‌ మిశ్రా  3-0-16-0; రూథర్డ్‌ఫర్డ్‌ 2-0-19-0 
ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌: 
పృథ్వీ షా (సి) రైనా (బి) చాహర్‌ 4; ధావన్‌ (బి) హర్భజన్‌ 19; శ్రేయస్‌ (స్టంప్డ్‌) ధోని (బి) జడేజా 44; పంత్‌ (సి) బ్రావో (బి) తాహిర్‌ 5; ఇంగ్రామ్‌ ఎల్బీ (బి) జడేజా 1; అక్షర్‌ (సి) వాట్సన్‌ (బి) తాహిర్‌ 9; రూథర్‌ఫర్డ్‌ (సి) చాహర్‌ (బి) తాహిర్‌ 2; మోరిస్‌ (స్టంప్డ్‌) ధోని (బి) జడేజా 0; సుచిత్‌ రనౌట్‌ 6; మిశ్రా (సి) ధోని (బి) తాహిర్‌ 8; బౌల్ట్‌ నాటౌట్‌ 1; ఎక్స్‌ట్రాలు 0 
మొత్తం: (16.2 ఓవర్లలో ఆలౌట్‌) 99; 
వికెట్ల పతనం: 1-4, 2-52, 3-63, 4-66,  5-81, 6-83, 7-84, 8-85, 9-92; 
బౌలింగ్‌: 
చాహర్‌ 3-0-32-1; హర్భజన్‌ 4-0-28-1; తాహిర్‌ 3.2-0-12-4; జడేజా 3-0-9-3 బ్రావో  3-0-18-0