చెన్నై సూపర్ కింగ్స్ టార్గెట్ః 156

చెన్నై సూపర్ కింగ్స్ టార్గెట్ః 156

చిదంబరం స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 నష్టానికి 155  చేసింది. ముందుగా టాస్ గెలిచిన చెన్నై జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ కు దిగిన ముంబయి జట్టును కెప్టెన్ రోహిత్ శర్మ (67 పరుగులు, 48 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్ లు) హాఫ్ సెంచరీతో ఆదుకున్నాడు. ఇవన్ లివైస్ (32 పరుగులు, 30 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్), డికాక్ (15 పరుగులు,9 బంతుల్లో ఒక ఫోరు), హార్దీక్ పాండ్య (23 పరుగులు, 18 బంతుల్లో ఒక ఫోరు, ఒక సిక్స్) మినహా మిగతా బ్యాట్ మెన్ ఎవరూ క్రీజ్ లో నిలదొక్కుకోలేక పోయారు. చెన్నై బౌలర్లలో దీపక్ చాహార్, ఇమ్రాన్ తాహీర్ చెరో వికెట్ తీసుకోగా, మిచెల్ సాంటర్ రెండు వికెట్లు పడగొట్టాడు. 

ఇక చెన్నై జట్టు మూడు మార్పులతో ఈ మ్యాచ్ బరిలో దిగింది. ధోనీ, రవీంద్ర జడేజా, డుప్లెసిస్‌ల స్థానంలో ధృవ్ షోరే, మురళీ విజయ్, మిషెల్ శాంట్నర్‌ని జట్టులోకి తీసుకుంది. ఈ మ్యాచ్‌లో ముంబై తమ జట్టులో రెండు మార్పులు చేసింది. బెన్‌ కట్టింగ్, మయాంక్ మార్ఖండేల స్థానంలో ఎవిన్ లివీస్, అనుకూల్ రాయ్‌ జట్టులోకి వచ్చారు.