చెన్నై సూపర్ కింగ్స్ టార్గెట్ః 176

చెన్నై సూపర్ కింగ్స్ టార్గెట్ః 176

చెపాక్ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ కు 176 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఈ మ్యాచ్ లో  చెన్నై జట్టు టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. బ్యాటింగ్ కు దిగిన హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఓపెనర్ బెయిర్ స్టో(0) ఈ మ్యాచ్ లో నిరాశ పరిచాడు. డేవిడ్ వార్నర్(57), మనీష్ పాండే(85) ఇద్దరు కలిసి రెండో వికెట్ కు 115 పరుగుల భాగస్వామ్యం అందించారు. డేవిడ్ వార్నర్ ఔట్ అయ్యాక.. మనీశ్‌పాండే ధాటిగా ఆడుతూ విజయ్‌శంకర్‌(26)తో కలిసి మూడో వికెట్‌కు 47 పరుగులు జోడించాడు. విజయ్ శంకర్ ఔట్ కాగానే పాండే, యూసుఫ్ పఠాన్(5) కలిసి చెన్నైముందు 176 పరుగుల లక్ష్యాన్ని ఉంచారు. చెన్నై బౌలర్లలో హర్బన్ సింగ్ రెండు, దీపక్ చాహార్ ఒక వికెట్ తీశారు.