ఐపీఎల్ 2021 : చెన్నై దే విజయం...

ఐపీఎల్ 2021 : చెన్నై దే విజయం...

ఐపీఎల్ లో ఈరోజు రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టులో బ్యాట్స్మెన్స్ లో అందరూ కలిసి రాణించారు. మొయిన్ అలీ(26), డు ప్లెసిస్(33) తో రాణించారు. ఇక చివర్లో బ్రావో 8 బంతుల్లో 20 పరుగులు చేయడంతో ఆ జట్టు నిర్ణిత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఇక 189 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగ్గిన రాజస్థాన్ కు ఓపెనర్లు మంచి ఆరంభాని అందించారు. జోస్ బట్లర్ (49) తో అదరగొట్టిన మిగిత వారు ఎవరు రాణించలేదు. చెన్నై స్పిన్నర్లు జడేజా, మొయిన్ అలీ చివరి ఓవర్లలో రెండు రెండు వికెట్లు తీసి రాయల్స్ ను దెబ్బ తీసాడు. దాంతో ఆ జట్టు నిర్ణిత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి కేవలం 143 పరుగులు చేయడంతో చెన్నై 45 పరుగుల భారీ తేడాతో ఐపీఎల్ 2021 లో తమ రెండో విజయాన్ని నమోదు చేస్తే రాయల్స్ తమ రెండో ఓటమి నమోదు చేసింది.