టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై... 

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై... 

యూఏఈలోని అబుదాబిలో ఐపీఎల్ 2020 తొలిమ్యాచ్ జరగగబోతున్నది.  చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగబోతున్నది.  రెండు బలమైన జట్లే.  ధోని సారధ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 8 సార్లు ఫైనల్స్ కు చేరుకోగా మూడుసార్లు విజయం సాధించింది.  ఐదుసార్లు రన్నరప్ గా నిలిచింది.  ఇక రోహిత్ శర్మ సారధ్యంలోని ముంబై ఇండియన్స్ జట్టు ఐదుసార్లు ఫైనల్స్ కు చేరుకోగా నాలుగుసార్లు ట్రోఫీని గెలుచుకుంది. ఇక ఇదిలా ఉంటె అబుదాబిలో జరుగుతున్న తొలిమ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ను ఎందుకుంది.  ఛేజింగ్ చేయడంలో చెన్నై సూపర్ కింగ్స్ కు పెట్టింది పేరు.  ఎలాగైనా అత్యధిక స్కోర్ సాధించి విజయం సాధించాలనే కసితో ఉన్నది ముంబై జట్టు.  తక్కువ స్కోర్ కు కట్టడి చేసి ఈజీగా ఛేజింగ్ చేయాలని చూస్తోంది చెన్నై జట్టు.  2019 వరల్డ్ కప్ సెమిస్ తరువాత ధోని గ్రౌండ్ లోకి అడుగుపెడుతున్నాడు. ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారనే విషయం మరికొన్ని గంటల్లోనే తేలిపోతుంది.