ఐపీఎల్ 2020 : టాస్ ఓడి మొదట బౌలింగ్ చేయనున్న సన్‌రైజర్స్ ...

ఐపీఎల్ 2020 : టాస్ ఓడి మొదట బౌలింగ్ చేయనున్న సన్‌రైజర్స్ ...

ఐపీఎల్ 2020 లో ఈ రోజు సన్‌రైజర్స్ హైదరాబాద్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఇందులో టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ ధోని బ్యాటింగ్ ఎంచుకోవడంతో హైదరాబాద్ మొదట బౌలింగ్ చేయనుంది. అయితే ఈ ఏడాది ఐపీఎల్ లో తమ స్థాయి ప్రదర్శన చేయని చెన్నై ఈ మ్యాచ్ లో సన్‌రైజర్స్ ను ఓడించగలదా అనే అనుమానం అందరిలోనూ ఉంది. ఇక గత మ్యాచ్ లో ఓటమి చవిచూసిన హైదరాబాద్ ఈ మ్యాచ్ లో ఎలాగైనా విజయం సాధించాలని చూస్తుంది. చూడాలి మరి ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అనేది.

హైదరాబాద్ : డేవిడ్ వార్నర్ (c), జానీ బెయిర్‌స్టో (w), మనీష్ పాండే, కేన్ విలియమ్సన్, ప్రియామ్ గార్గ్, విజయ్ శంకర్, రషీద్ ఖాన్, షాబాజ్ నదీమ్, సందీప్ శర్మ, ఖలీల్ అహ్మద్, టి నటరాజన్

చెన్నై : షేన్ వాట్సన్, ఫాఫ్ డుప్లెసిస్, అంబటి రాయుడు, ఎంఎస్ ధోని (w/c), రవీంద్ర జడేజా, సామ్ కర్రన్, డ్వేన్ బ్రావో, దీపక్ చాహర్, శార్దుల్ ఠాకూర్, పియూష్ చావ్లా, కర్న్ శర్మ