పిన్న వయస్సులో 'గ్రాండ్‌మాస్టర్‌'

పిన్న వయస్సులో 'గ్రాండ్‌మాస్టర్‌'

ప్రపంచ చెస్‌ చరిత్రలో మరో అద్భుతం చోటుచేసుకుంది. అతి పిన్న వయస్సులో గ్రాండ్‌మాస్టర్‌(జీఎం) హోదా పొందాడు చెన్నైకు చెందిన కుర్రాడు. శనివారం ఇటలీలో గ్రెడైన్‌ ఓపెన్‌లో జరిగిన ఎనిమిదో రౌండ్‌ గేమ్‌లో చెన్నై కుర్రాడు ప్రజ్ఞానంద 33 ఎత్తుల్లో ఇటలీ గ్రాండ్‌మాస్టర్‌ లూకా మోరోనిపై విజయం సాధించాడు. దీంతో ప్రపంచ చెస్‌ చరిత్రలో పిన్న వయస్సులో భారత్‌ తరఫున గ్రాండ్‌మాస్టర్‌ హోదా పొందిన ప్లేయర్‌గా ప్రజ్ఞానంద గుర్తింపు పొందాడు. ప్రపంచంలో మాత్రం రెండో ప్లేయర్‌గా ఉన్నాడు. ప్రపంచంలో పిన్న వయస్సులో జీఎం అయిన రికార్డు యుక్రెయిన్ దేశానికి చెందిన సెర్గీ కర్జాకిన్‌(12 ఏళ్ల 7 నెలలు) పేరిట ఉంది. ఇద్దరి మధ్య వ్యత్యాసం కేవలం మూడు నెలల మాత్రమే. మరోవైపు 12 ఏళ్ల 10 నెలల 14 రోజుల వయస్సులో ప్రజ్ఞానంద జీఎం హోదా పొంది భారత్‌ తరఫున జీఎం అయిన పిన్న వయస్కుడిగా రికార్డు  నెలకొల్పాడు. అంతకుముందు పరిమార్జన్‌ నేగి(13 ఏళ్ల 4 నెలల 22 రోజులు) పేరిట ఉంది.