చర్లపల్లి జైలు ఖైదీ పరార్

చర్లపల్లి జైలు ఖైదీ పరార్

కిటికీ గ్రిల్ తిలగించి ప్లాస్టిక్ పైప్ కిందకు వేసి దర్జాగా పారిపోయాడో సైకో ఖైదీ. ఈ ఘటన సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో జరిగింది. మైలర్ దేవపల్లికి చెందిన విక్కీ అనే వ్యక్తిపై పోలీసులు 307 కింద కేసుపెట్టి చర్లపల్లి జైలుకు పంపారు. భార్యపై కోపం పెంచుకున్న విక్కీ గత కొన్ని రోజుల క్రితం బ్లేడ్ ముక్కలు మింగాడు. దీంతో విక్కీని హుటాహుటిన గాంధీ ఆస్పత్రికి తరలించారు జైల్ అధికారులు. ఐతే గత నెల 25వ తేదీ నుంచి చికిత్స పొందుతున్నాడు.

ఆదివారం రాత్రి సమయంలో అందరూ నిద్రలోకి జరుకున్నాక బాత్రూమ్ లోకి వెళ్లిన విక్కీ తిరిగి రాలేదు. అనుమానంతో లోపలికి వెళ్ళి చూడగా.. కిటికీ గ్రిల్ తొలగించడంతో పాటు ప్లాస్టిక్ పైప్ కింది అంతస్తుకు వేసి ఉంది. దీంతో ఖైదీ విక్కీ పారిపోయాడని నిర్దారించిన జైల్ ఎస్కార్ట్ చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిలకలగూడ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు. ఆయన భార్యకు విక్కీ ద్వారా ప్రాణహాని ఉండడంతో వెంటనే అక్కడి పోలీసులకు సమాచారం అందించారు.