కరోనాతో విషమంగా మాజీ క్రికెటర్ పరిస్థితి...

కరోనాతో విషమంగా మాజీ క్రికెటర్ పరిస్థితి...

భారత మాజీ క్రికెటర్ చేతన్ చౌహాన్ కు కరోనా సోకినా విషయం తెలిసిందే. ఆయనకు కరోనా పాజిటివ్ వచ్చి నెల రోజులు దాటింది. అయితే మొదట్లో ఆయనను ఇంట్లోనే ఉంచి కరోనా చికిత్స అందించిన పరిస్థితి విషమంగా మారడంతో ఆసుపత్రికి తరలించారు. ఈ వైరస్ కారణంగా ఆయన శరీర అవయవాలు దెబ్బతింటున్నాయి. గత శుక్రవారం నుండి ఆయన మూత్రపిండాలు పనిచేయడం లేదని అలాగే రక్తపోటు సమస్యలను ఎదుర్కొంటున్నాడు అని వైద్యులు తెలిపారు . ఇక రెండుసార్లు మాజీ లోక్‌సభ ఎంపి అయిన చౌహాన్ వైరస్ బారిన పడిన కొద్దిమంది మాజీ అంతర్జాతీయ క్రికెటర్లలో ఒకరు. చేతన్ చౌహాన్ భారతదేశం తరపున 40 టెస్టులు మరియు 7 వన్డేలు ఆడాడు, రెడ్ బాల్ క్రికెట్‌లో 31.57 సగటుతో 2084 పరుగులు , 50 ఓవర్ల ఫార్మాట్‌లో 21.85 వద్ద 153 పరుగులు చేశాడు. అలాగే ఆయన మహారాష్ట్ర మరియు ఢిల్లీ తరఫున రంజీ ట్రోఫీ లో ఆడాడు. ఈయన 1981 లో అర్జున అవార్డుతో సత్కరించబడ్డాడు.