బ్యాటింగ్ చేయ‌గ‌ల‌డు కానీ.. డ్యాన్స్ చేయ‌లేడు

బ్యాటింగ్ చేయ‌గ‌ల‌డు కానీ.. డ్యాన్స్ చేయ‌లేడు

నాలుగు టెస్టుల సిరీస్‌ను భారత్‌ 2-1 తేడాతో కైవసం చేసుకోవడంతో అస్ట్రేలియా గడ్డపై భారత్‌ తొలిసారిగా టెస్ట్ సిరీస్ గెలిచింది. సిరీస్ గెలిచిన అనంతరం మైదానంలో భారత జట్టు సభ్యులు వెరైటీ డ్యాన్స్ చేశారు. అనంతరం భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారు. అక్కడ ఓ జర్నలిస్ట్ 'మీరు చేసిన డ్యాన్స్‌కు అసలు అర్థమేంటి' అని కోహ్లిని అడిగాడు. 'ఆ ప్రశ్న రిషబ్ పంత్‌ను అడగండి. ఆ డ్యాన్స్ అతడు నేర్పించిందే. పంత్ చెబితే చేసాం' అని విరాట్ బదులిచ్చాడు.

'ఇది చాలా ఈజీ డాన్స్. పుజారా కనీసం ఆ డ్యాన్స్ కూడా చేయలేకపోయాడు. పుజారా నడిచేటప్పుడు చేతులు కూడా కదపడు. పుజారా నడకకు అడ్వాన్స్ వర్షెన్ ఇది' అని విరాట్ సరదాగా అన్నారు. ఇక క్రికెట్ ఆస్ట్రేలియా ఈ డాన్స్ కు సంబందించిన వీడియోను పోస్ట్ చేసింది. 'పుజారా బ్యాటింగ్ చేయ‌గ‌ల‌డు కానీ.. డ్యాన్స్ చేయ‌లేడు' అని ట్వీట్ చేసింది.