తుడా చైర్మెన్ గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి

తుడా చైర్మెన్ గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి

ఏపీ ప్రభుత్వం తిరుమల అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మెన్ గా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధి పులివర్తి వెంకట మణిప్రసాద్ పై గెలుపొందారు. చెవిరెడ్డిని ఇప్పటికే ప్రభుత్వ విప్ గా కూడా నియమించారు. చిత్తూరు జిల్లాలో అధికార వైసీపీ అత్యధికంగా 13 అసెంబ్లీతో పాటు రెండు ఎంపీ సీట్లను కూడా గెలుచుకుంది.