ఎస్పీ కెరీర్ ను దెబ్బకొడతా: చెవిరెడ్డి

ఎస్పీ కెరీర్ ను దెబ్బకొడతా: చెవిరెడ్డి

మా నాయకుల శరీరం గాయాలయ్యేలా కొట్టారు. నేను న్యాయస్థానం ఎదుట ఎస్పీ విక్రాంత్ పాటిల్ కెరీర్ ను దెబ్బకొడతా.. అలా జరగని పక్షంలో నా పేరు భాస్కర్ రెడ్డి కాదు అని వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సవాల్ చేశారు. నేడు చిత్తూరులో భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ... అధికారంతో పని లేకుండా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ని న్యాయస్థానం ముందు దోషిగా తేలుస్తానన్నారు. పాకిస్దాన్ తీవ్రవాదులతో సంబంధాలు ఉన్నాయన్న సెక్షన్ తప్పించి మిగిన అన్ని తప్పుడు సెక్షన్ లతో మా నాయకులపై కేసు నమోదు చేయించారు. అందుకు ఎస్పీకి కృతజ్ఞతలు అని భాస్కర్ రెడ్డి ఎద్దేవా చేశారు.

ఇరు వర్గాలు ధర్నా చేస్తే.. మాపై కేసు నమోదు చేసి, టీడీపీ వారు ధర్నా చేయడం తన దృష్టికి రాలేదనడం సిగ్గుచేటు చర్య అని మండిపడ్డారు. ఇప్పటి నుండి వ్యక్తిగతంగా లీగల్ సెల్ ఏర్పాటు చేసుకుంటాం. ఎస్పీ తీసుకునే ప్రతీ చర్యను క్షుణ్ణంగా పరిశీలిస్తాం. న్యాయస్దానం ఎదుట ఎస్పీ విక్రాంత్ పాటిల్ కెరీర్ ను దెబ్బకొడతా అని భాస్కర్ రెడ్డి సవాల్ చేశారు.