భారత క్రికెట్ కెప్టెన్ కి ఛాలెంజ్ విసిరిన ఫుట్ బాల్ కెప్టెన్

భారత క్రికెట్ కెప్టెన్ కి ఛాలెంజ్ విసిరిన ఫుట్ బాల్ కెప్టెన్

కరోనా మహమ్మారి కారణంగా ఆటలు లేకపోవడంతో ఫిట్‌నెస్ సవాళ్లు విసురుకోవడం మన భారత ఆటగాళ్లలో ఒక అలవాటుగా మారింది. అదే తరహాలో భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ గత కొన్ని వారాలుగా తనకి విసిరిన సవాళ్లను ఎదుర్కొంటున్నాడు. క్లాప్ ఛాలెంజ్ నుండి పవర్ లిఫ్టింగ్ వరకు, కోహ్లీ అని ఛాలెంజ్ లు స్వీకరించాడు. అయితే తాజాగా భారత ఫుట్‌బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రి  కూడా కోహ్లీకి ఓ సవాలు విసిరాడు. ఛెత్రి  సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసాడు, ఆందులో అతను 2 స్విస్ బంతుల పై పడుకొని బ్యాలెన్స్ చేస్తున్నాడు. ఇక ఛేత్రి తన పోస్ట్‌కి కోహ్లీని ట్యాగ్ చేసి ఇలా చేయమని ఛాలెంజ్ విసిరాడు. అయితే ఈ ఛాలెంజ్ పై కోహ్లీ స్పందిస్తూ... నాకు 2 స్విస్ బంతులు ఎక్కడ లభిస్తాయి?" అని కామెంట్ జత చేసాడు. ఇక దానికి సమాధానంగా కోహ్లీ ఇది చేసే లోపు నేను క్లాప్ పుష్ అప్స్ చేయడానికి ప్రయత్నిస్తాను అని ఛెత్రి చెప్పాడు. ఏదిఏమైనా ఈ విరామ సమయం లో ఈ రకమైన ఛాలెంజ్ లు విసురుకుంటూ తమ  ఫిట్‌నెస్ పెంచుకుంటున్నారు భారత ఆటగాళ్లు.