చిరంజీవికి అందుబాటులో లేని పవన్ !

చిరంజీవికి అందుబాటులో లేని పవన్ !

ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్బంగా అభిమానులు, శ్రేయోభిలాషులు, సహా నటులు, రాజకీయ నాయకులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేస్తుండగా  మెగాస్టార్ చిరంజీవి కూడ తన ప్రియమైన తమ్ముడికి బర్త్ డే విషెస్ తెలియజేశారు.

ముందుగా పవన్ ను స్వయంగా కలిసి అభినందించాలని అనుకున్నారు చిరు.  కానీ పవన్ అందుబాటులో లేకపోవడంతో ఆయనకు మానసిక స్థైర్యాన్ని, ధైర్యాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించమని తన ఇష్ట దైవం హనుమాన్ ను ప్రార్థిస్తున్నట్టు తెలిపారాయన.