చికాగో సెక్స్ రాకెట్ దోషులకు 18న శిక్ష

చికాగో సెక్స్ రాకెట్ దోషులకు 18న శిక్ష

చికాగో సెక్స్ రాకెట్ కేసులో దోషులకు 18న శిక్ష ఖారురు కానుంది. ఈ కేసులో టాలీవుడ్ నిర్మాత కిషన్ మోదుగుపుడి అలియాస్ శ్రీరాజ్ చెన్నుపాటి, ఆయన భార్య చంద్రకళను అమెరికాలోని వర్జీనియాకు చెందిన కోర్ట్ దోషులుగా తేల్చింది. అక్రమంగా హీరోయిన్ల తరలింపు, నకిలీ పాస్ పోర్ట్, వ్యభిచారం వంటి నేరాలపై ఇద్దరికీ ఐదేళ్లు శిక్ష పడే అవకాశం ఉంది. కిషన్ దంపతులు సెక్స్ దందా నడుపుతున్నట్లు అభియోగాలు రావడంతో 2017 మే లో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. ఫెడరల్ దర్యాప్తు అధికారులు 2018 జనవరిలో సమాచారం సేకరించి కేసును హోం ల్యాండ్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్ కు అప్పగించింది. ప్రొడక్షన్ మేనేజర్‌గా, సహ నిర్మాతగా గతంలో పనిచేసిన కిషన్ తనకున్న పరిచయాలతో ఈవెంట్ల పేరిట టాలీవుడ్ హీరోయిన్లను అమెరికాకు రప్పించేవాడు. షికాగోలోని కిషన్ ఇంట్లో, వివిధ నగరాల్లోని హోటల్స్ లో ఉంచి తన భార్య సహకారంతో వారితో వ్యభిచారం చేయించారు. వీరిని కావాల్సిన విమాన టికెట్లు, హోటల్స్ లను కిషన్ మోదుగుమూడి, ఆయన భార్య చంద్రకళలు ఏర్పాటు చేసేవారు. ఏడాది కాలంలో తారల కోసం 76 విమాన టికెట్లు బుక్ చేశారు. వీటన్నిటికి సంబంధించిన రికార్డులు, స్టేట్మెంట్లు, ఫోన్ టెక్స్ట్ మెసేజ్ ల ఆధారంగా కేసు చేధించారు. దీనిపై పూర్తి సమాచారాన్ని కోర్ట్ కు అందజేశారు.