అజ్ఞాతంలో కేంద్ర మాజీ మంత్రి చిదంబరం..!

అజ్ఞాతంలో కేంద్ర మాజీ మంత్రి చిదంబరం..!

కేంద్ర మాజీ మంత్రి చిదంబరం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. సీబీఐ, ఈడీ అరెస్ట్‌ చేయకుండా ముందస్తు బెయిల్‌ కోసం ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. యాంటిసిపేటరీ బెయిల్‌ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. దీంతో ఆయన లాయర్లు సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేశారు. అయితే... అప్పటికే కోర్టు సమయం ముగియడంతో విచారణ జరగలేదు. చిదంబరం ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై రేపు సుప్రీం కోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే... చిదంబరాన్ని అదుపులోకి తీసుకుని విచారించాలని సీబీఐ, ఈడీ భావిస్తున్నాయి. ఢిల్లీ హైకోర్టులో ముందస్తు బెయిల్‌ నిరాకరించకపోడంతో... ఇవాళ సాయంత్రం చిదంబరం ఇంటికి సీబీఐతో పాటు ఈడీ అధికారులు వెళ్లారు. అయితే, చిదంబరం అందుబాటులో లేకపోవడంతో అధికారులు వెనుదిగారు. అయితే, చిదంబరం ఎక్కడికీ పరారవ్వలేదంటున్నారు కాంగ్రెస్‌ నేతలు. ఆయన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై రేపు సుప్రీంలో విచారణ జరుగుతుందన్నారు కాంగ్రెస్‌ నేత అభిషేక్‌ మను సింఘ్వీ.