ఎయిర్‌టెల్, జియో సీటీవోల రాజీనామా

ఎయిర్‌టెల్, జియో సీటీవోల రాజీనామా

భారత దేశ ప్రముఖ టెలికాం సంస్థలైన భారతీ ఎయిర్‌టెల్‌, రిలయన్స్‌ జియో ఛీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్లు(సీటీవో) తమ పదవులకు రాజీనామా చేశారు. ఇద్దరు ఆదివారమే రాజీనామా చేయడంతో టెలికం రంగంలో అలజడి రేగింది. రిలయన్స్‌ జియో గ్రూప్‌ సీటీవోగా పనిచేస్తున్న జగ్బీర్‌ సింగ్‌ ఈ రోజు తన రాజీనామాను సమర్పించారు. జియో 4జీ సేవలను ప్రారంభించకముందు నుంచే జగ్బీర్‌ సింగ్‌ పనిచేస్తున్నారు. అయితే రాజీనామాకు గల కారణాలు రహస్యంగా ఉంచారు.

మరోవైపు భారతీ ఎయిర్‌టెల్ సీటీవో శ్యామ్ ప్రభాకర్ మర్దికర్ కూడా తన పదవికి రాజీనామా చేశారు. ఇదే విషయాన్ని ఎయిర్‌టెల్ అధికారులు ధ్రువీకరించారు. ప్రభాకర్ వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేసినట్టు సమాచారం. గతంలో ఈయన రాజీనామా చేసి తిరిగి ఎయిర్‌టెల్ లో చేరారు.