'ఆకాశమంత ఎత్తుకు సీఎం జగన్‌..!'

'ఆకాశమంత ఎత్తుకు సీఎం జగన్‌..!'

ప్రజాసమస్యల పరిష్కారంపైనే ఎక్కువగా దృష్టి పెడతామన్నారు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి.. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. సీఎం జగన్ నిర్ణయాలపై ప్రజలు ఆనందంతో ఉన్నారని తెలిపారు. నిన్న జరిగిన క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలతో సీఎం జగన్ ఆకాశమంత ఎత్తుకు ఎదిగారని ప్రశంసించిన శ్రీకాంత్ రెడ్డి... రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి... ప్రజాస్వామ్య పద్దతిలో సమావేశాలు జరుగుతాయని.. గత ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా పక్కన పెట్టిందని విమర్శించారు. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్లే ప్రజలు బాగా గుణపాఠం చెప్పారని వ్యాఖ్యానించిన శ్రీకాంత్ రెడ్డి.. ప్రజా సమస్యలపై ఫోకస్ పెడతామన్నారు.