చంద్రబాబు వల్లే వరల్డ్‌ బ్యాంక్ రుణ తిరస్కరణ..!

చంద్రబాబు వల్లే వరల్డ్‌ బ్యాంక్ రుణ తిరస్కరణ..!

చంద్రబాబు దుర్మార్గాల వల్లే ప్రపంచ బ్యాంకు రుణాన్ని తిరస్కరించిందని ఆరోపించారు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి... ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు అడిగింది చంద్రబాబు.. ఆయనకు వ్యతిరేకంగా ప్రపంచ బ్యాంకుకు నివేదికలు పంపింది రాజధాని రైతులన్న ఆయన.. ల్యాండ్ పూలింగ్ యాక్ట్ ను దుర్వినియోగం చేశారని ఫిర్యాదులో రైతులు పేర్కొన్నారని వెల్లడించారు. కౌలు రైతులు, రైతులను చంద్రబాబు భయాందోళనలకు గురి చేస్తున్నారని ఫిర్యాదు చేశారని.. దళితుల భూములను కాజేస్తున్నారని ఫిర్యాదులో రైతులు పేర్కొన్నారని.. భూ రికార్డులను టీడీపీ నేతలు తారుమారు చేస్తున్నారని రైతులు ప్రపంచ బ్యాంకుకు ఫిర్యాదు చేశారని వెల్లడించారు. ప్రపంచ బ్యాంకు రుణాన్ని తిరస్కరణలో వైస్సార్సీపీకి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేసిన శ్రీకాంత్ రెడ్డి.. వైస్సార్సీపీ ఫిర్యాదు మేరకు రుణం రాలేదని టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వడం లేదని రైతులు ఫిర్యాదు చేశారని చెప్పుకొచ్చారు శ్రీకాంత్ రెడ్డి.