"నో కరోనా ఇన్ చికెన్" పని చేసింది !

"నో కరోనా ఇన్ చికెన్" పని చేసింది !

 కరోనా భయాన్ని ఫేవరెట్ ఫుడ్ పక్కకు పెట్టింది. సండే రావడంతోనే తెలుగు రాష్ట్రాల జనం.. చికెన్, మటన్ షాపుల ముందు క్యూ కట్టారు. సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ .. ఫేవరెట్ ఫుడ్ కొనుగోలు చేశారు. అయితే గిరాకీ పెరగడం, తగినంత స్టాకు లేకపోవడంతో.. చికెన్, మటన్ ధరలు పెరిగాయి. అయినా సరే ముక్కకు జై కొట్టారు జనం. చికెన్ నోరూరిస్తోంది. మటన్ స్మెల్ .. ప్రాణాలు లాగేస్తోంది. ఇంకేముంది సండే రాగానే జనం.. షాపుల ముందు వాలిపోయారు. సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ.. కావాల్సినంత కొనుగోలు చేసి .. హాయిగా  ఇంటికెళ్లారు. జనం నుంచి డిమాండ్ పెరగడంతో ధరలు అనూహ్యంగా పెరిగాయి. కిలో చికెన్ రెండు వందలకు చేరగా.. కిలో మటన్ 800 రూపాయలు టచ్ అయింది. అయినా సరే ముక్కకు జై కొట్టారు తెలుగుజనాలు.

కోళ్లు, మాంసం తింటే కరోనా రాదన్న ప్రచారం ఫలించిందా లేక చికెన్, మటన్ మీదున్న ఆశతో భయాన్ని తొక్కి పట్టిందో తెలియదు కానీ.. జనం మాత్రం ముందు జాగ్రత్తలు తీసుకుంటూ కొనుగోలు చేశారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో కొన్నిచోట్ల చేపలు, మాంసం అమ్మే ప్రాంతాల్లో ... నిబంధలు గాలికొదిలేశారు. గుంపులుగా చేరి, బేరాలాడుతూ కొనుగోలు చేశారు. చికెన్, మటన్ ధరలు పెరగడంపై షాపుల యజమానులు సంతోషం వ్యక్తం చేశారు. కరోనా ప్రభావంతో చాలా ఇబ్బందులు పడుతున్నామంటున్నారు దుకాణ దారులు.