రుహాని శర్మ డోస్ పెంచేసిందిగా..!!

రుహాని శర్మ డోస్ పెంచేసిందిగా..!!

చిలసౌ వంటి వెడ్డింగ్ సెంటిమెంట్ సినిమాలో నటించిన రుహాని శర్మ.. ఇప్పుడు డోస్ పెంచింది.  క్లీన్ యూ గెటప్ లో అదరగొట్టిన ఈ అమ్మడు.. ఇప్పుడు గ్లామర్ గెటప్స్ లో కనువిందు చేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ సిగ్నల్స్ ఇస్తున్నది.  ఇందులో భాగంగానే ఇటీవలే ఈ ముద్దుగుమ్మ ప్రత్యేకంగా ఫోటో సెషన్ కు హాట్ హాట్ గా పోజులు ఇచ్చింది.  

ఆ ఫోటోను చూస్తే ఎవరీమె.. చిలసౌ రుహాని శర్మనా అని నోరెళ్లబెట్టడం ఖాయం.  ఉల్లిపొరలాంటి డ్రెస్ తో క్లీవేజ్ అందాలతో యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నది.  గ్లామర్ డోస్ ఎక్కువైనా పర్వాలేదు.. అలాంటి సినిమాల్లో నటించేందుకు సిద్ధంగా ఉన్నానంటూ చెప్పే విధంగా ఉన్నది ఆ ఫోటో.  ఇప్పటికే ఈ ఫోటో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది.  ఈ ఫోటో చూశాకైనా మన దర్శక నిర్మాతలు రుహానికి గ్లామర్ రోల్స్ ఇస్తారో లేదో చూడాలి.