పోలీసుల వ్యాన్‌ దూకెళ్లి చిన్నారి మృతి..

పోలీసుల వ్యాన్‌ దూకెళ్లి చిన్నారి మృతి..

కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి ప్రణతి మృతిచెందింది. ఇవాళ తెల్లవారుజామున 5.45 గంటలకు పాప మృతిచెందినట్టుగా వైద్యులు తెలిపారు. చిన్నారి గుండె పనిచేయకపోవడం వల్లే మృతిచెందింది అంటున్నారు వైద్యులు. కాగా, నాలుగు రోజుల క్రితం యాదగిరిగుట్ట పాత నరసింహ స్వామి టెంపుల్ దగ్గర దైవ దర్శనం చేసుకుని తన కుటుంబసభ్యులతో కలిసి నిద్రిస్తున్న మూడేళ్ల చిన్నారి ప్రణతిపైకి పోలీసు వాహనం దూసుకెళ్లింది. ప్రణతి పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌ ఎల్బీనగర్‌లోని కామినేని ఆస్పత్రికి ప్రణతిని తరలించి చికిత్స అందించినా ఉపయోగం లేకుండా పోయింది. ప్రణతి మృతితో ఆ కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.