కారులో ఊపిరాడక చిన్నారులు మృతి

కారులో ఊపిరాడక చిన్నారులు మృతి

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ముజాహిద్‌నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. కారులో ఊపిరాడక ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. మృతులిద్దరూ అక్కాచెల్లెళ్ల కుమారులు రియాజ్(10), మహ్మద్(5). ముజాహిద్‌నగర్‌కు చెందిన వీరిద్దరూ నిన్న మధ్యాహ్నం ఆడుకుంటామని చెప్పి బయటకు వెళ్లారు. కాసేపటికి వీరిద్దరూ కనిపించకుండా పోవడంతో కంగారుపడిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈక్రమంలో నిన్న అర్థరాత్రి సమయంలో మృతుల ఇంటికి సమీపంలోని ఓ కారు వెనకసీటులో రియాజ్‌, మహ్మద్‌లిద్దరూ విగత జీవులుగా కనిపించారు.