పడవ ప్రమాదంలో గల్లంతైన విద్యార్థులు వీరే..

పడవ ప్రమాదంలో గల్లంతైన విద్యార్థులు వీరే..

తూర్పుగోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం పశువుల్లంక వద్ద శనివారం గోదావరి నదిలో నాటు పడవ బోల్తాపడింది. ఈ ఘటనలో ఐదుగురు గల్లంతైనట్టు ప్రాథమిక సమాచారం. సలాదివారిపాలెం లంక నుంచి పశువుల్లంకకు సుమారు 31 మందితో బయల్దేరిన ఈ నాటు పడవ మొండిల్లంక రేవు వద్ద నిర్మాణంలో ఉన్న వంతెన పిల్లర్‌కు తగలడంతోనే ఈ ప్రమాదం జరిగింది. ప్రయాణికుల్లో ఎక్కువ మంది విద్యార్థులే, వీరందరూ పదవ తరగతి చదువుతున్నట్లు సమాచారం. గల్లంతైన వారి వివరాలు.. కొండేపూడి ర‌మ్య, పోలిశెట్టి వీర మ‌నీష, సుంక‌ర శ్రీజ, సిరికోటి  ప్రియ, పోలిశెట్టి అనుష, పోలిశెట్టి సుచిత్రగా తెలుస్తుంది. పిల్లలందరు పశువులలంక పాఠశాలలో చదువుతున్నారు. ఘటన గురించి తెలియగానే హోంమంత్రి చినరాజప్ప, కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా, ఎస్పీ విశాల్‌ గున్నీ ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిపై ఆరా తీశారు. ఎన్డీఆర్‌ఎఫ్‌, అగ్నిమాపక దళం, గజ ఈతగాళ్లను రంగంలోకి దింపనున్నట్లు మంత్రి చినరాజప్ప తెలిపారు.