నెరవేరిన రైతు చిన్ననాటి కల

నెరవేరిన రైతు చిన్ననాటి కల

తమిళనాడులోని ఓ రైతు తన చిన్ననాటి కలను సాకారం చేసుకున్నాడు. ఎనిమిదేళ్ల వయసులో చూసిన కారును ఎంతో కష్టపడి 88 ఏళ్ల వయసులో కొనుక్కున్నాడు. కాంచీపురానికి చెందిన దేవరాజన్ వ్యవసాయం చేస్తుంటాడు. చిన్నతనంలో మెర్సిడెస్ బెంజ్ కారును చూసి ముచ్చట పడ్డాడు. ఆ కారును చూడగానే ఎలాగైనా సొంతం చేసుకోవాలని ఏకంగా రూ.33 లక్షలు కూడబెట్టాడు. 

నాకు 8 ఏళ్ల వయసు ఉన్నప్పుడు బెంజ్ కారును చూశాను. కనీసం ఆ కారు పేరు కూడా నాకు తెలియదు. కానీ ఆ కారు లోగో మాత్రం నాకు బాగా నచ్చింది. దాంతో అప్పటినుంచే కారును ఎలాగైనా సొంతం చేసుకోవాలని నిర్ణయించున్నాను. ఆ కల ఇప్పటికి నెరవేరిందన్నారు. దేవరాజన్ కథ గురించి తెలిసిన బెంజ్‌ షోరూం డీలరైన ట్రాన్స్ కార్ ఇండియా దీన్నంతా వీడియో తీసి యూట్యూబ్‌లో షేర్ చేసింది. ఆయన తో కేకును కట్ చేయించి, దేవరాజన్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అంటూ ఓ స్టోరీని రూపొందించింది.