స్ప్రే రూపంలో కొత్త వాక్సిన్: ట్రయల్స్ కు గ్రీన్ సిగ్నల్ 

స్ప్రే రూపంలో కొత్త వాక్సిన్: ట్రయల్స్ కు గ్రీన్ సిగ్నల్ 

ప్రపంచంలో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి.  కరోనా వైరస్ కు వాక్సిన్ ను కనుగొనేందుకు ప్రపంచ దేశాలు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాయి.  ఇప్పటికే ఏడు వాక్సిన్ లు క్లినికల్ దశల్లో ఉన్నాయి.  ఇందులో నాలుగు వాక్సిన్ లు చైనాలోనే ఉండటం విశేషం.  ఇక ఇదిలా ఉంటె, చైనా ఇప్పుడు మరో వాక్సిన్ ను కనుగొనే దిశగా అడుగులు వేస్తోంది.  సూదిమందు ద్వారా కాకుండా, స్ప్రే రూపంలో వాక్సిన్ ను రెడీ చేస్తున్నది.  స్ప్రే ను ముక్కుల్లో వేయడం ద్వారా కరోనా వైరస్ నుంచి దూరంగా ఉండొచ్చని అంటోంది.  హాంకాంగ్ యూనివర్శిటీ, జియామెన్ విశ్వవిద్యాలయం, బీజింగ్ వాంటై బియోలజికల్ ఫార్మ సంస్థలు కలిసి ఈ వాక్సిన్ ను తయారు చేస్తున్నాయి.  ఈ వాక్సిన్ ట్రయల్స్ కు చైనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  త్వరలోనే ట్రయల్స్ ను ప్రారంభించబోతున్నారు.  ట్రయల్స్ వచ్చే ఏడాదికి పూర్తవుతుందని పరిశోధకులు చెప్తున్నారు.  వాక్సిన్ ట్రయల్స్ పూర్తి చేసుకొని సక్సెస్ అయితే, కరోనా వైరస్ ను అరికట్టడం మరింత ఈజీ అవుతుందని పరిశోధకులు చెప్తున్నారు.