భారీగా లక్షణాలులేని కరోనా కేసులు... ఎక్కడంటే..!

 భారీగా లక్షణాలులేని కరోనా కేసులు... ఎక్కడంటే..!

షాంఘై: ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశం చైనాలో కరోనా విజృంభిస్తోంది. మొదట కొన్ని లక్షణాలతో ఈ వ్యాధిని కనుకోవడం మొదలుపెట్టారు డాక్టర్లు. తరువాత వ్యాధి మరింత బలపడి అన్ని లక్షణాలు లేకపోయిన కొన్ని లక్షణాలతో కొందరిని ఇబ్బంది పెట్టింది. అయితే ప్రస్తుతం చైనాలో అధిక సంఖ్యలో ఈ కేసులు పెరిగిపోతున్నాయి. గత ఏడు నెలలుగా ఎటువంటి లక్షణాలు లేకపోయినా కరోనా పాజిటివ్ వస్తున్న కేసులు పెరిగిపోతున్నాయి. రోజులో కనీసం 137 కేసులైనా లక్షణాలు లేకుండా, పరీక్షల ద్వారా మాత్రమే బయటపడుతున్నాయి. అయితే చైనాలో ఇప్పటివరకూ వచ్చిన కరోనా కేసుల సంఖ్య 85,810, మరణాల రేటు 4,634గా నమోదైంది. ప్రస్తుతం చైనా దీన్ని ఎదుర్కునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఇది చైనాలో రెండో సారి కరోనా కేసుల నమోదుగా పరిగణిస్తున్నారు.