సంబరాల్లో చైనా... ఇదే కారణం...!!

సంబరాల్లో చైనా... ఇదే కారణం...!!

గత రెండు నెలలుగా చైనాను ఇబ్బంది పెడుతున్న కరోనా వైరస్ ఇప్పుడు అక్కడ తగ్గుముఖం పడుతున్నది.  కొత్త కేసుల సంఖ్య కూడా తగ్గిపోతుండటంతో చైనా ఆనందనానికి అవధులు లేవు.  ఇప్పటికే 3000 మందికి పైగా చైనా లో ఈ వైరస్ కారణంగా మరణించారు.  అయితే, చైనా ప్రభుత్వం తీసుకున్న సత్వర చర్యల వలన అక్కడి ప్రజలు కోలుకుంటున్నారు.  

చైనా ప్రభుత్వాధికారులు, మెడికల్ స్టాఫ్, వైద్యులు, నర్సులు ప్రతి ఒక్కరు కూడా రెస్ట్ లేకుండా, విసుగు చెందకుండా ప్రాణాలకు తెగించి కరోనాపై యుద్ధం చేశారు.  చాలా వరకు అరికట్టగలిగారు.  చైనాలో ఈ వైరస్ తగ్గుముఖం పడుతుందనే వార్తలు బయటకు రావడంతో రెండు నెలలుగా రెస్ట్ లేకుండా పనిచేస్తున్న నర్సులు డ్యాన్స్ చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు.  వైరస్ ఎలా వ్యాప్తి చెందిందో అందరికి తెలిసిందే.  ఇప్పుడు చైనా వెలుపల ఈ వైరస్ వేగంగా విస్తరిస్తోంది.  ఇటలీ, ఇరాన్, దక్షిణకొరియా వంటి దేశాల్లో వేగంగా విస్తరిస్తోంది.  విచిత్రం ఏమిటంటే ఉత్తరకొరియాలో ఒక్క కేసుకూడా నమోదు కాలేదు.  అటు ఆఫ్రికా దేశాల్లో ఈ వైరస్ పెద్దగా విస్తరించలేదు.