చైనాను వీడిన కరోనా...ఆనందంలో డ్రాగన్...
చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన కరోనా వైరస్ ఆ దేశాన్ని అతలాకుతలం చేసింది. గబ్బిలాల వలన ప్రజలకు సోకినా ఈ వైరస్ వలన చైనాలో మూడువేల మందికి పైగా మరణించారు. వేలాది మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. రెండు నెలల తరువాత అక్కడ క్రమంగా తగ్గడం మొదలుపెట్టింది. క్రమంగా తగ్గుతూ వచ్చిన కరోనా వైరస్ నిన్నటి రోజున ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.
దీంతో చైనాలో పండగ వాతావరణం నెలకొన్నది. నవంబర్ నెలలో మొదలైన ఈ వైరస్ జనవరి నుంచి తీవ్రతరం కావడం మొదలుపెట్టింది. జనవరి నుంచి మార్చి 18 వ తేదీ వరకు ఆ దేశంపై ప్రభావం చూపించింది. నిన్నటి నుంచి ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాకపోవడంతో ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. చైనాలో నిర్బంధం విధించంతో పాటుగా అక్కడ కఠినమైన చర్యలు తీసుకోవడంతో ఇది సాధ్యం అయ్యింది. కాగా, చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన కరోనా ఇప్పుడు ప్రపంచాన్ని తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్నది. ఈ వైరస్ తో యూరప్ దేశాలు అతలాకుతలం అవుతున్నాయి. అమెరికా సైతం బెంబేలెత్తిపోతోంది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)