పాక్ విషయంలో చైనా సంచలన నిర్ణయం!

పాక్ విషయంలో చైనా సంచలన నిర్ణయం!

ఓవైపు ఉగ్రవాద నిర్మూలన కోసం చర్యలు తీసుకోకుంటే పాక్‌ను ఏకాకిని చేయాలని.. అంతర్జాతీయ సమాజం భావిస్తున్న తరుణంలో చైనా సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ దేశంతో ద్వైపాక్షిక సంబంధాలు పెంచుకునేందుకు మరో అడుగు ముందుకేసింది. పాక్‌ సంక్షేమ ప్రాజెక్టుల్లో ఒక బిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టే యోచనలో ఉన్నట్లు ప్రకటించింది. చైనా-పాక్‌ మధ్య ఉన్న ఎకనామిక్‌ కారిడార్‌ సంతృప్తికరంగా ఉందన్న చైనా రాయబారి యవో జింగ్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. చైనా-పాకిస్థాన్‌ ఉచిత వాణిజ్య ఒప్పందం రెండో దశను ఈ ఏడాది అక్టోబరు నాటికి పూర్తి చేస్తామంటోంది చైనా. పాకిస్థాన్‌లో ఉన్న వ్యాపార అవకాశాల గురించి చైనాలో.. అవగాహన కల్పించేందుకు పాక్‌కు చెందిన మహిళా వ్యాపారులను పంపనున్నట్లు తెలిపింది. యూఏఈ ఇప్పటికే 3 మిలియన్ డాలర్ల రుణం ఇవ్వగా.. ఐఎంఎఫ్ కూడా 6 బిలియన్ డాలర్ల రుణం ఇవ్వడం కోసం సూత్రప్రాయంగా అంగీకరించింది.