అమెరికాకు వార్నింగ్‌ ఇచ్చిన డ్రాగన్..!

    అమెరికాకు వార్నింగ్‌ ఇచ్చిన డ్రాగన్..!

అమెరికాలో టిక్ టాక్ ను నిషేదించాలని ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై డ్రాగన్ దేశం మండిపడింది. ట్రంప్ తీసుకునే నిర్ణయం తరవాత  పర్యవసానాలకు అమెరికా సిద్ధంగా ఉండాలని చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌ వార్ణింగ్ ఇచ్చారు. తమ దేశంలోని వాణిజ్య కంపెనీలకు తాము అండగా ఉంటామన్నారు. అమెరికా వైఖరిని తాము పూర్తిగా ఖండిస్తున్నామని అన్నారు. అమెరికా తన చర్యలతో  వాణిజ్య కంపెనీల, వినియోగదారుల ప్రయోజనాలను  విస్మరిస్తోందని అన్నారు. ఇది అమెరికా చైనా రాజకీయ సమీకరణాలను తారుమారు చేయడం, అణచివేతకు గురిచేయడంలో భాగమేనని మండిపడ్డారు.