కరోనాను అడ్డుకునేందుకు చైనా ఏం చేసిందో చూశారా ? 

కరోనాను అడ్డుకునేందుకు చైనా ఏం చేసిందో చూశారా ? 

కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే.  ఈ వైరస్ ధాటికి ఇప్పటికే వేలాదిమంది మృత్యువాత పడ్డారు.  ఈ వైరస్ మరింత ఉదృతం కావడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. హుబె ప్రావిన్స్ లో ఉదృతం కావడంతో చైనా ఓ వినూత్నమైన నిర్ణయం తీసుకుంది.  కరోనా వ్యాపించడానికి కరెన్సీ నోట్లు కూడా ఒక కారణం కావొచ్చు.  

కరోనా వైరస్ కరెన్సీ నోట్ల ద్వారా కూడా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తోంది.  దీంతో చైనా ఈనిర్ణయం తీసుకున్నది.  హుబె ప్రావిన్స్ లోని పాత కరెన్సీ నోట్లను గోడౌన్ కు తరలించింది. దాని ప్లేస్ లో ప్రజలు ఎక్కువగా ఈ కామర్స్, నెట్ బ్యాంకింగ్ సేవలు వినియోగించుకోవాలని కోరింది.  దీంతో పాటుగా హుబె ప్రావిన్స్ కు కొత్త కరెన్సీ నోట్లను పంపించేసింది.  ఈ విధంగానైనా కొంతవరకు కరోనాను అరికట్టే అవకాశం ఉన్నట్టుగా సమాచారం.  మరి చూద్దాం ఏమౌతుందో.