ఆ బాధ్యత బాబుదే: చినరాజప్ప

ఆ బాధ్యత బాబుదే: చినరాజప్ప

టీడీపీఎల్పీగా చంద్రబాబునాయుడుని ఎన్నుకున్నామని.. ఉప నేత, విప్‌ల ఎంపిక బాధ్యతను ఆయనకు అప్పజెప్పామని ఆ పార్టీ ఎమ్మెల్యే నిమ్మకాయల రాజప్ప చెప్పారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ తక్కువ మంది సభ్యులున్నా.. ప్రజల తరఫున పోరాడతామన్నారు. ఓటమిపై విశ్లేషణ చేసుకుంటామని రాజప్ప చెప్పారు. ఇవాళ ఉదయం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో జరిగిన టీడీఎల్పీ సమావేశంలో శాసనసభాపక్ష నేతగా చంద్రబాబును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.