భారత్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో 66% వాటా చైనా బ్రాండ్లదే

భారత్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో 66% వాటా చైనా బ్రాండ్లదే

భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్లో చైనా బ్రాండ్లు దుమ్ము రేపుతున్నాయి. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో రికార్డు స్థాయిలో 66 శాతం చైనా స్మార్ట్ ఫోన్లు అమ్ముడయ్యాయి. వీటిలో అగ్రస్థానం షావోమీ కార్ప్ ది కాగా ఇతర చైనా బ్రాండ్లు వివో, రియల్ మి, ఒప్పో అమ్మకాల్లో 20 శాతం పెరుగుదల నమోదు చేశాయి.

ఏడాదిగా భారత్ లో షావోమీ అమ్మకాఉల 2 శాతం తగ్గాయి. కానీ బీజింగ్ కేంద్రంగా పనిచేసే కంపెనీ ఇప్పటికీ దేశంలో అతిపెద్ద స్మార్ట్ ఫోన్ బ్రాండ్ గా కొనసాగుతోంది. తర్వాత స్థానంలో దక్షిణ కొరియాకు చెందిన శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ లిమిటెడ్ ఉన్నట్టు హాంకాంగ్ కు చెందిన కౌంటర్ పాయింట్ రీసెర్చ్ తెలిపింది. వివో అమ్మకాలు 119 శాతం పెరగగా, ఒప్పో విక్రయాలు 28 శాతంగా నమోదయ్యాయి. 

ప్రపంచంలోనే అతివేగంగా విస్తరిస్తున్న స్మార్ట్ ఫోన్ మార్కెట్ అయిన భారత్ లో అందుబాటులో ధరలు, సెల్ఫీ కెమెరాలు, పెద్ద స్క్రీన్లు చైనా బ్రాండ్ల అమ్మకాల పెరుగుదలకు కారణాలుగా చెబుతున్నారు. 

నెట్ ఫ్లిక్స్ ఇంక్, హాట్ స్టార్ వంటి వీడియో స్ట్రీమింగ్ సర్వీసులు, ఫేస్ బుక్ కి చెందిన మెసేజింగ్ యాప్ వాట్సాప్ వంటి యాప్స్ వినియోగం పెరగడంతో డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. డేటా వినియోగం పెరుగుతుండటంతో యూజర్లు తమ ఫోన్లను చాలా తక్కువ కాలానికే మార్చేస్తున్నట్టు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దీంతో మిడ్-టైర్ ధరల్లో ఉన్న బ్రాండ్ల కీలక స్పెసిఫికేషన్లు అతి వేగంగా మారిపోతున్నాయని అంటున్నారు.