పివి సింధుకు చైనా కంపెనీ స్పాన్సర్... ఏడాదికి ఎంతంటే.. ?

పివి సింధుకు చైనా కంపెనీ స్పాన్సర్... ఏడాదికి ఎంతంటే.. ?

లడఖ్ యొక్క గాల్వన్ లోయలో చైనా బలగాలతో జరిగిన ఘర్షణలో 21 మంది భారతీయ సైనికులు మరణించారు. అయితే అప్పటి నుండి ''బాయికాట్ చైనా'' అనే నినాదం భారత్ లో అధికంగా వినిపిస్తుంది. ఇక ఈ సెగ  భారత క్రీడలను కూడా తాకింది. మన ఐపీఎల్ కు ''వివో'' అనే ఒక చైనా ఫోన్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ స్పాన్సర్షిప్ చేస్తుంది. దానివల్ల మన బీసీసీఐ కి 400 కోట్ల లాభం కలుగుతుంది.  అదే విధంగా మన భారత క్రీడాకులకు కూడా కొన్ని చైనా కంపెనీలు స్పాన్సర్లుగా వ్యవహరిస్తున్నాయి. అయితే ఒలింపిక్స్ లో రజత పతకం సాధించిన తొలి భారతీయ మహిళ క్రీడాకారిణి పివి సింధు కు ఓ చైనా  కంపెనీ స్పాన్సర్షిప్ చేస్తుంది. 'చైనా ప్రీమియం స్పోర్ట్స్ బ్రాండ్ లి-నింగ్' అనే ‌కంపెనీతో నాలుగేళ్ల ఒప్పందం(2019-23) కుదుర్చుకుంది సింధు. ఈ ఒప్పందం లో ఏడాదికి 12కోట్లు అంటే నాలుగు ఏళ్లకు మొత్తం రూ. 48 కోట్లు సింధు అందుకుంటుంది. అంతే కాకుండా 5 కోట్ల సింధు పరికరాలకు అదనంగా అందిస్తుంది ఈ కంపెనీ. కేవలం సింధు మాత్రమే కాదు మరో ఆటగాడు కిదాంబి శ్రీకాంత్‌ కూడా ఇదే కంపెనీతో నాలుగేళ్లకు గాను రూ. 35 కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్నాడు.