కాక్‌పిట్‌లో ప్రయాణికురాలి ఫొటో వైరల్.. పైలట్‌పై నిషేధం..!
కాక్‌పిట్‌లో ఓ ప్రయాణికురాలు దిగిన ఫోటో వైరల్ అయిన తర్వాత చైనా పైలట్‌పై నిషేధం విధించింది.. ఈ సంఘటన జనవరి 4వ తేదీన గుయిలిన్ నుండి యాంగ్జౌకి వెళ్తోన్న గుయిలిన్ జీటీ1011 విమానంలో జరిగింది. విమానం కాక్‌పిట్‌లో మహిళా ప్రయాణికురాలు దిగిన ఫొటో వైరల్‌గా మారింది.. దీంతో సంబంధిత పైలట్‌కు ఫ్లైయింగ్ నిషేధించినట్లు ఇవాళ తెలిపారు. ఫొటోలో మహిళ తన వేళ్ళతో 'వి' గుర్తు చూపిస్తూ.. కాక్‌పిట్‌లో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.. కెప్టెన్‌కు ధన్యవాదాలు.. చాలా సంతోషంగా ఉంది.. అంటూ కామెంట్ పెట్టింది. అయితే, ప్రయాణికురాలిని కాక్‌పిట్‌లోకి అనుమతించడం ద్వారా సిబ్బంది తాను నిబంధనలు ఉల్లంఘించానని" ఎయిర్ గుయిలిన్ ఒక ప్రకటనలో పేర్కొంది.. చైనా సివిల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం, ప్రత్యేక అనుమతి లేకుండా లేదా అవసరమైన సమయంలో ప్రయాణీకులను కాక్‌పిట్‌లోకి అనుమతించరు. ఇక, ఈ ఘటన సమయంలో విమానంలో ఉన్న ఇతర సిబ్బందిని కూడా శాశ్వతంగా సస్పెండ్ చేశారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)