ఈ విధానం మంచిది కాదు: చినజియార్ స్వామి

ఈ విధానం మంచిది కాదు: చినజియార్ స్వామి

ఆలయాలు కొత్తగా ఏర్పడినవి కావు, రెండు కోట్ల సంవత్సరాల నుంచి ఆలయాలు ఉన్నట్లు వేదాలు తెవియచేస్తున్నాయని చినజీయర్ స్వామి అన్నారు. ఈ రోజు చినజీయర్ స్వామి విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు. చినజియార్ స్వామికి దుర్గగుడి అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు దుర్గమ్మ ఆశీర్వచనాలను చినజియర్ స్వామికి అందచేశారు. అమ్మవారి ప్రసాదాలతో పాటు చిత్రపటాన్ని చిన జీయర్ స్వామికి దుర్గగుడి ఈఓ కోటేస్వరమ్మ, చైర్మన్ గౌరంగబాబు అందజేశారు.

అనంతరం చినజియార్ స్వామి మాట్లాడుతూ... ఆంధ్ర రాష్ట్రానికి ముఖ ద్వారంగా విజయవాడ నగరం ఉంది. రాష్ట్రానికి రక్షణగా దుర్గమ్మ ఉంది. సమతా భావనతో ప్రజలందరిని ఒక చోట చేర్చేవి ఆలయాలు. ద్వైత, అద్వైత, విశివ్ట ఆద్వాతం నేర్పిన శంకరా చార్యలు ఆలయంలలో సమతాభావంతో ఉండాలన్నారు. వ్యక్తిని సంస్కరించి ఉన్నతులుగా తీర్చిదిద్దినవి ఆలయాలు. దైవంపై విశ్వాసం కలిగిన వారే ఆలయాంలో సేనకులుగా ఉండాలన్నారు. ఆలయ ఆస్తులను కాపాడాల్సిన బాద్యత ప్రభుత్వానిది. ప్రభుత్వానికి అవసరం అని ఆలయ భూములు తీసుకోవడం సరికాదని చినజియార్ స్వామి అన్నారు. ప్రస్తుతం ఆలయ భూములు, నిధులను అన్యాక్రాంతం అవుతున్నాయి. ఈ విధానం రాష్ట్రానికి, ప్రజలకు మంచిది కాదన్నారు. భగవంతుడికి నివేదిన చేసిన తర్వాతే అన్నదానం చేయాలి. వైధికుల ద్వారా తయారైన పదార్థాలే నివేదన చేయాలి. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ప్రజలు సోదర భావంతో మెలగాలని చినజియార్ అన్నారు.