వైసీపీ గూటికి చీరాల ఎమ్మెల్యే ఆమంచి

వైసీపీ గూటికి చీరాల ఎమ్మెల్యే ఆమంచి

ప్రకాశం జిల్లాలో టీడీపీకి మరో ఎదురు దెబ్బ తగలనుంది. చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ టీడీపీకి గుడ్ బై చెప్పడం ఖాయమైంది. గత కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్న ఆమంచి, వైసీపీలో చేరాలని భావిస్తున్నారు. ఇవాళ ఈ విషయంపై చర్చించేందుకు వేటపాలెం మండలం పందిళ్లపల్లిలో కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఇప్పటికే చీరాల ఎమ్మెల్యే ఆమంచితో జనసేన, వైసీపీ టచ్ లో ఉన్నారు. అయితే  కృష్ణమోహన్ ఈరోజు సాయంత్రం లేదా రేపు జగన్ ని కలిసే అవకాశం ఉంది..