మెగాస్టార్ ను కలిసిన 'క్రాక్' దర్శకుడు

మెగాస్టార్ ను కలిసిన 'క్రాక్' దర్శకుడు

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా డైరెక్టర్ గోపీచంద్ మలినేని రూపొందించిన 'క్రాక్' సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. మాస్ అభిమానులకు మంచి కిక్ ఇచ్చింది. వరుస పరాజయాలతో డీలా పడిన రవితేజకు మళ్లీ విజయం అందించింది. అంతేకాదు క్రాక్ సినిమా ఒక సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. రవితేజ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్న సినిమాగా నిలిచింది. కాగా, ఈ సినిమా డైరెక్టర్ గోపీచంద్ మలినేనిపై సినీ పెద్దలు ప్రశంసలు కురిపిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా ఇటీవల దర్శకుడుని ప్రత్యేకంగా కలుసుకొని సినిమా గురించి మాట్లాడరట. ఆ విషయాన్ని గోపిచంద్ మలినేని చాలా ఆనందంగా తన ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు.