నాకు మాత్రమే దక్కిన అదృష్టం..

నాకు మాత్రమే దక్కిన అదృష్టం..

అలనాటి నటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం మహానటి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం రేపట్నుంచి థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సంధర్భంగా మెగా స్టార్ చిరంజీవి..సావిత్రి గారితో తనకున్న అనుబంధాన్ని తెలిపారు. చిరు మాట్లాడుతూ..ఎందరో నటీమణులున్నారు కానీ మహానటి మాత్రం సావిత్రి గారే. నాకు మాత్రమే దక్కిన అదృష్టమేమిటంటే..నా కెరియర్ కి పునాదిగా నిలిచిన పునాది రాళ్లు చిత్రంలో వారితో కలిసి నటించడం జరిగింది. గ్లిజరిన్ లేకుండా కన్నీళ్లు కార్చి నటించే మహానటి సావిత్రి. కళ్ళతోనే హావభాలు పలికి..తాను కదలకుండా కథ మొత్తం నడిపించగలిగే మహానటి సావిత్రి గారే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక నటిగా, అమ్మగా, వ్యక్తిగా, స్ఫూర్తి ప్రధాతగా నా మనసులో ఎప్పుడు ఉంటారు. అలాంటి మహానటి మీద బయోపిక్ తీసి నేటి తరాలకు ఆమె గొప్పతనం తెలియచేసే ప్రయత్నం చేస్తున్న ఈ చిత్ర బృందానికి నా అభినందనలు. ఈ చిత్రం అఖండ విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.