20 ఎకరాల్లో ‘ఆచార్య’ సెట్

20 ఎకరాల్లో ‘ఆచార్య’ సెట్

మెగాస్టార్ చిరంజీవి హీరోగా, దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘ఆచార్య’. చిరంజీవి సరసన కాజల్‌ అగర్వాల్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం గురించి ఓ వార్త సంచలనం సృష్టిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌ నగర శివారులోని కోకాపేటలో చిత్రీకరణ చేస్తున్నారు. ఆచార్య సినిమా కోసం కోకాపేటలో టెంపుల్‌ టౌన్‌ సెట్‌ వేశారు. దీని ప్రత్యేకత ఏంటంటే.. 20 ఎకరాల్లో దాన్ని నిర్మించారు. మన దేశంలో ఓ సినిమా కోసం అన్ని ఎకరాల్లో అంత భారీ సెట్‌ వేయడం ఇదే తొలిసారి. 

‘ఆచార్య’ కథలో కీలకమైన పాత్రలో రామ్‌చరణ్‌ కనిపించనున్నారు. తండ్రీకొడుకులు చిరంజీవి, చరణ్‌పై ఓ పాటను తెరకెక్కించడానికి దర్శకుడు కొరటాల శివ ప్లాన్‌ చేశారని విశ్వసనీయ వర్గాల సమాచారం. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం మేలో విడుదల కానుంది.