ఆచార్య 'టీజర్' అప్డేట్ వచ్చేసింది

ఆచార్య 'టీజర్' అప్డేట్ వచ్చేసింది

కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న 'ఆచార్య' సినిమా చిరంజీవికి ప్రతిష్టాత్మకంగా మారింది. కాజల్ అగర్వాల్ మరోసారి చిరుతో ఈ సినిమాలో జతకట్టింది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్  చిరంజీవి అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. పైగా రాంచరణ్ కూడా ఇందులో నటిస్తుండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా కోసం హైదరాబాద్ శివార్లలో 25 కోట్ల విలువైన భారీ సెట్ నిర్మించారు. సినిమాలో ఎక్కువ భాగం అక్కడే పూర్తవుతుంది. ఈ సినిమాను నిరంజన్ రెడ్డి,  రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. తాజాగా 'ఆచార్య' టీజర్ ను రిపబ్లిక్ డే సందర్బంగా జనవరి 26 న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. కాగా ఈ సినిమాలో రామ్ చరణ్ 'సిద్ధ'గా కనిపించనున్నారు. నిన్న రిలీజ్ అయిన రామ్ చరణ్ ప్రీ లుక్ అదుర్స్ అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ ది కీలక పాత్ర అని కొరటాల శివ గతంలోనే వెల్లడించారు.