రాజకీయాలు వద్దు...కమల్, రజనీలకి "చిరు" సలహా ! 

 రాజకీయాలు వద్దు...కమల్, రజనీలకి "చిరు" సలహా ! 

రాజకీయాలకు ఎంత దూరంగా ఉంటే అంతమంచిదంటూ కమల్‌ హాసన్, రజనీకాంత్‌కు సలహా ఇచ్చారు చిరంజీవి. తాను సినిమాల్లో నెంబర్ వన్‌గా ఉంటున్న సమయంలో రాజకీయాల్లోకి వచ్చానని ప్రత్యర్ధులు కోట్లు కుమ్మరించడంతో సొంత నియోజకవర్గంలోనే ఓడిపోయానన్నారు. తమిళ మేగజైన్ ఆనంద వికటన్‌ కు తాజాగా ఇంటర్వ్యూ ఇచ్చిన చిరు ఈ సందర్భంగానే రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాజకీయాలు పూర్తిగా డబ్బుమయంగా మారిపోయాయని పేర్కొన్న ఆయన సౌమ్యులకు రాజకీయాలు టీ తాగినంత ఈజీ కాదని కామెంట్ చేశారు. తాను స్వయంగా పోటీ చేసినా తన ప్రత్యర్ధులు కోట్లు కుమ్మరించి ఓడించారని పేర్కొన్నారు. తన తమ్ముడు పవన్ కల్యాణ్ విషయంలోనూ ఇదే జరిగిందని అన్నారు. నన్నడిగితే రజనీకాంత్, కమల్ హాసన్‌ రాజకీయాల్లోకి రావొద్దనే సలహా ఇస్తానని ఆయన చెప్పుకొచ్చారు.