సమ్మర్ 2019... చిరంజీవి vs బాలకృష్ణ!

సమ్మర్ 2019... చిరంజీవి vs బాలకృష్ణ!

సమ్మర్ సమరానికి చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం చిరంజీవి 'సైరా నరసింహా రెడ్డి'లో నటిస్తున్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో రూపొందుతోన్న హిస్టారికల్ ఫిల్మ్‌ని వచ్చే ఏడాది వేసవికి విడుదల చేయాలనుకుంటున్నారు. అదే వేసవికి బాలకృష్ణ కూడా తన సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నార్ట‌. ఇప్పుడు బాలకృష్ణ చేతిలో రెండు సినిమాలు వున్నాయి. ఒకటి... ఎన్టీఆర్ బయోపిక్. 

వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుందీ సినిమా. మరొకటి.. వీవీ వినాయక్ దర్శకత్వంలో నటించనున్న ఫ్యాక్షన్ సినిమా. దీన్నే వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. గతేడాది సంక్రాంతికి హిస్టారికల్ ఫిల్మ్ 'గౌతమిపుత్ర శాతకర్ణి'తో బాలకృష్ణ, పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ 'ఖైదీ నంబర్ 150'తో చిరంజీవి బాక్సాఫీస్ బరిలో దిగారు. ఇద్దరూ విజయం సాధించారు. వచ్చే వేసవికి చిరంజీవి హిస్టారికల్ ఫిల్మ్‌తో, బాలకృష్ణ కమర్షియల్ ఫిల్మ్‌తో రానున్నారు. ఈసారీ ఇద్దరూ విజయం సాధించాలని ఆశిద్దాం.