మెగాస్టార్‌- న‌ట‌సింహా ఒకే వేదిక‌పై..

మెగాస్టార్‌- న‌ట‌సింహా ఒకే వేదిక‌పై..

మెగాస్టార్ చిరంజీవి- న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ ఒకే వేదిక‌పై క‌నిపించే ఛాన్సుందా? అంటే అవున‌నే స‌మాచారం. మెగా- నంద‌మూరి అభిమానుల‌కు స్పెష‌ల్‌ ట్రీట్‌కి వేదిక సిద్ధమవుతోంది.. మెగాస్టార్, బాల‌య్య చాలా కాలం క్రితం  ఓ అవార్డుల వేదిక‌పై క‌నిపించారు. టాలీవుడ్ వజ్రోత్సవాల వేళ క‌లిసి మెలిసి క‌నిపించారు. కానీ ఆ త‌ర‌వాత మ‌ళ్లీ వేదిక‌ల‌పై పెద్దగా క‌లిసిందేం లేదు. 

అందుకే ఆ ఇరువురు ఒకే వేదిక‌పై క‌నిపిస్తారు అన‌గానే అభిమానుల్లో ఉత్కంఠ పెరిగింది. అయితే ఆ ఇద్దరూ క‌నిపించే వేదిక ఏది? అంటే మెగాస్టార్ అల్లుడు క‌ళ్యాణ్ దేవ్ `విజేత‌` సినిమా ప్రీరిలీజ్ వేదిక‌పై ఈ ట్రీట్ ఉంటుంద‌ని తెలుస్తోంది. వారాహి చ‌ల‌న‌చిత్రం అధినేత సాయి కొర్రపాటి ఆహ్వానం మేర‌కు బాల‌య్య ఈ వేదిక‌పైకి విచ్చేస్తున్నార‌ట‌. ఇక ఎలానూ అల్లుడు సినిమా కాబ‌ట్టి చిరంజీవి ఈ వేదిక‌కు ముఖ్య అతిధి. ఈ ఆదివార‌మే ప్రీరిలీజ్ వేడుక జ‌ర‌గ‌నుంది. క‌ళ్యాణ్‌దేవ్‌- మాళ‌విక నాయిర్ జంట‌గా రాకేశ్ శ‌శి ద‌ర్శక‌త్వంలో సాయి కొర్రపాటి నిర్మించిన `విజేత‌` త్వరలో రిలీజ్ కానుంది.