ఫైర్‌మెన్‌కు చిరంజీవి బహుమతి !

ఫైర్‌మెన్‌కు చిరంజీవి బహుమతి !

హైదరాబాద్ నగరంలో కురిసిన భారీ వర్షాల కారణంగా గౌలిగూడలోని నాలాలో పడిన నాలుగేళ్ల దివ్య అనే చిన్నారిని ఫైర్‌మెన్‌ క్రాంతి కుమార్ సాహసోపేతంగా రక్షించిన సంగతి తెలిసిందే.  ఈ విషయాన్ని వార్తా పత్రికల ద్వారా తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి క్రాంతి కుమార్ ను అభినందించి తన చిరంజీవి చారిటబుల్ ట్రస్టు ద్వారా లక్ష రూపాయలను బహుమతిగా అభినందించారు.  ఆ చెక్కును క్రాంతి కుమార్ కు అల్లు అరవింద్ అందజేశారు.  క్రాంతి కుమార్ తో పనిచేసిన ఇతర సిబ్బందిని కూడా చిరంజీవి అభినందించారు.